బాలల రక్షణలో ఉపాధ్యాయులే కీలకం | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణలో ఉపాధ్యాయులే కీలకం

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

● జిల్లా జడ్జి సునీత కుంచాల

● జిల్లా జడ్జి సునీత కుంచాల

పెద్దపల్లి: విద్యార్థుల భద్రత, రక్షణతోపాటు వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. మి షన్‌ బాల సురక్ష–శిక్షా, న్యాయ –2026 చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా నామినేట్‌ చేసిన ఉపాధ్యాయులకు పిల్లల హక్కులపై కలెక్టరేట్‌లో శనివారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. జడ్జి మాట్లాడుతూ, పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలల్లో ఉపాధ్యాయులతో గడుపుతారని, కొన్నిసందర్భాల్లో తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలనూ ఉపాధ్యాయులతో పంచుకుంటారని అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపు లు, అఘాయిత్యాలను అరికట్టడంతోపాటు వారిని రక్షించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంద ని తెలిపారు. పోక్సో చట్టం విద్యార్థులకు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు డ్రగ్స్‌ బారిన పడకుండా పర్యవేక్షించాలని చెప్పా రు. డీసీపీ రాంరెడ్డి మాట్లాడారు. అనంతరం సాధ న సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను జడ్జి సునీత కుంచాల ఆవిష్కరించారు. కార్య కమంలో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి (పోక్సో) కె.స్వప్నరాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేశం, జిల్లా విద్యా శాఖ అధికారి (ఇన్‌చార్జి) హన్మంతు, బాలికల చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కవిత, డిస్టిక్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ జితేందర్‌, లీగల్‌ కం ప్రొవిజన్‌ ఆఫీసర్‌ రజిత తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తొద్దు

గోదావరిఖని: వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ఆదేశించారు. శనివారం గోదావరి బ్రిడ్జి, శోభాయాత్ర తదితర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, ఏసీపీలు రమేశ్‌, వెంకటేశ్వర్‌, సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement