మంథని: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగా ణ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్క రూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం మంథనిలో దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు రాంపల్లి కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అ ర్పించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించేందుకు నాటి భారత ప్ర భుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆపరేషన్ పోలో నిర్వహించిందన్నారు. ఎందరో సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రజల కు విముక్తి లభించిందని తెలిపారు. ఆయన వెంట విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యు డు శశిభూషణ్ కాచే, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, ఆర్టిఏ సభ్యుడు మంథని సురేష్ తదితరులు ఉన్నారు.


