సింగపూర్‌లో ప్రాథమిక విద్యకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ప్రాథమిక విద్యకు పెద్దపీట

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: సింగపూర్‌ దేశంలో ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నారని డీఈవో శారద తెలిపారు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈనెల 12 నుంచి 19 వరకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ బృందం సింగపూర్‌లో పర్యటిస్తోంది. అందులో డీఈవో ఉన్నారు. డీఈవో మాట్లాడుతూ, అక్కడి విద్యా వ్యవస్థలో ఆరేళ్ల ప్రాథమిక విద్య తర్వాత సెకండరీ, ఆపై పోస్ట్‌–సెకండరీ విద్య కొనసాగుతుందన్నారు. ఈ విధానాన్ని 6+4+2గా పేర్కొంటారని, విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా తదుపరి విద్యా మార్గాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. అక్కడి ముఖ్యాంశాలను అధ్యయనం చేసి, తెలంగాణ విద్యా రంగంలో అన్వయించే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలిస్తోందని డీఈవో వివరించారు.

13ఏళ్ల బాలుడు.. ఐదడుగుల విగ్రహం

పాలకుర్తి: ఈసాలతక్కళ్లపల్లి సూర్యనగర్‌కు చెందిన పెసరి మనీష్‌(13) పర్యావరణ పరిరక్షణ కోసం ఐదడుగుల మట్టి వి నాయక విగ్ర హం తయారుచేశాడు. పెసరి మల్లేశ్‌–మాలతి దంపతులు కుమారుడైన మనీశ్‌ స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుచున్నాడు. చిన్నప్పటి నుంచి వినూత్నంగా ఆలోచించే బుడతడు.. తనకంటూ ఓ ప్రత్యేకత చాటాలనే సంకల్పంతో మట్టితో ఐదు అడుగుల విగ్రహాన్ని తయారుచేశాడు. ప్రకృతి సిద్ధమైన రంగులు అద్దాడు. తన ఇంటి ఆవరణలో నెలకొల్పాడు. మనీష్‌ను పలువురు అభినందించారు.

రైళ్లన్నీ రద్దీ

రామగుండం: సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ మధ్య నడిచే భాగ్యనగర్‌, ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌, తెలంగాణ, దాణాపూర్‌ తదితర రైళ్లన్నీ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వినాయక చవితి పండుగకు వచ్చిన ప్రజలు.. మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. పండుగకు ముందు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించడంతో ఎంతో సౌకర్యం కలిగింది. తిరుగు ప్రయాణం కోసం మరోమూడు రోజులు నడిపించాలనే డిమాండ్‌ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement