నాందేడ్, కలకత్తా, ముంబై లాంటి ప్రాంతాల్లో కళాకారులతో తయారుచేసే మట్టి గణపతి విగ్రహాలు మన ప్రాంతంలో పీవోపీతో తయారు చేసినవాటికన్నా మంచిఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడి మట్టి విగ్రహాలపై మండప నిర్వహకులకు అవగాహన కల్పించాలి. అధికారులు ప్రోత్సాహం అందించాలి. మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
– బొంపల్లి సంతోష్, మట్టి విగ్రహ తయారీదారు
పరిచయం చేసేందుకే..
మహారాష్ట్రలో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే నేను చిన్నప్పట్నుంచి చూశా. గోదావరిఖనికి వచ్చాక పీవోపీ విగ్రహాలే ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ మట్టి విగ్రహాలు పరిచయం చేయాలనే ఆలోచనతోనే మూడేళ్లుగా ‘జ్యోతి ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలు’ తయారు చేసి విక్రయిస్తున్నాం.
– కలగూర ప్రీతమ్, గోదావరిఖని
ముందస్తు ప్రచారంతోనే
ఫలితం
మట్టి గణపతి విగ్రహాల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై అధికారులు ముందస్తుగా ప్రచారం చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. కానీ, పండుగ సమయంలోనే ప్రచారం చేయడం వృథా. మట్టి విగ్రహాల తయారీ, పంపిణీని ముందుగానే చేపట్టి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి. మండప నిర్వాహకులు, యువజన సంఘాలు, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలి.
– పర్యావరణ ప్రేమికుడు


