సిరిసిల్లటౌన్: 80ఏళ్ల గణపయ్య ఉత్సవాలకు సిరిసిల్ల ముస్తామైంది. స్వాతంత్య్రానికి ముందే స్థానిక గాంధీచౌక్‌లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజారాం, ఎలగొండ నారాయణ మొదటి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తు తం మార్కండేయ భవనంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం జరుపుతుండగా అధ్యక్షుడిగా దూడం శంకర్ కొనసాగుతున్నారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో 1948 నుంచి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. స్థానిక పెద్దబజారు హన్మాన్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
పరంపర కొనసాగిస్తున్నాం
ఎనభై ఏళ్లక్రితం పట్టణ ప్రముఖులు కలిసి వినాయక ఉత్సవ సంఘం నెలకొల్పారు. వారు చూపిన ఆదర్శంలోనే మేము వేడుకలు జరుపుతున్నాం. ప్రతీ ఏడాది ఏకదంతుడికి నిత్య కై ంకర్యాలు, అన్నదానాలు నిర్వహిస్తాం. లోకకల్యాణార్థం జరిపే వేడుకలు తరతరాలు ఇలాగే వర్ధిల్లాలి.
– దూడం శంకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు


