కోనరావుపేట(వేములవా డ): మండలంలోని కనగర్తి 64 ఏళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవా లు నిర్వహిస్తున్నారు. మండలంలోనే తొలి సారిగా కనగర్తిలో 1962 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ కాలంలో ఉపాధ్యాయులుగా పనిచేసిన జగ్గారి శంకర్‌రె డ్డి, తుమ్మనపల్లి ఆనందం కామారెడ్డికి శిక్షణ కో సం వెళ్లి.. అక్కడ గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తర్వాత గ్రామానికి వచ్చి ఇక్కడా నవరాత్రి ఉత్సవాలు చేయాలని గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశా రు. అప్పటి నుంచి వినాయక వేడుకలు ఏటా నిర్వహిస్తున్నారు.


