కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: ఎన్టీపీసీ సీఎస్సార్ –సీడీ నిధులు జిల్లాలో ప్రజలకు ప్రయోజనం కలిగించేలా తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఎన్టీపీసీ సీఎస్సార్– సీడీ నిధుల వినియోగంపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. విద్య, వైద్య రంగాల్లో వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చే యాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేపట్టిన కొత్త భవన ని ర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల అదనపు తరగతి గ దుల నిర్మాణ ప్రగతిని కలెక్టర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


