కోల్‌సిటీ/రామగుండం: అటవీ సంపద పరిరక్షణ లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శుక్రవా రం రామగుండం సమీప రాజీవ్ రహదారి కుందనపల్లి అర్బన్ పార్క్ నుంచి గోదావరిఖని బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జీజీహెచ్‌లో అట వీ అధికారులు ఎంవీ నాయక్, ఎస్.మేఘరాజు, ప్ర దీప్, మాధురి, రాజు రక్తదానం చేశారు. పెద్దపల్లి ఎ ఫ్‌ఆర్‌వో తిరుమల సతీశ్‌కుమార్, మంథని ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో ఎంవీ వినయ్, ఎఫ్‌ఎస్‌వో రహమతుల్లా తదితరులు మాట్లాడారు. పెద్దపల్లి, మంథని అటవీ సిబ్బంది, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్ష న్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు.


