ఓదెల: విద్యుత్ కోతలకు ఉక్కపోత తోడవడంతో ప్రజలు గురువారం ఇబ్బందిపడ్డారు. తీవ్ర ఉక్కపోతగా ఉండడంతో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్ బి.వనజానాయక్ గురువారం ఆరుబయటే కూర్చుండి విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం వేళ విద్యుత్ కోతలు విధించడంతో కార్యాలయంలో ఉక్కపోత తట్టుకొలేక తహసీల్దార్ ఆరుబయటే ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించారు. కార్యాలయం చుట్టూ పచ్చని చెట్లు ఉండడంతో చల్లనిగాలి వీచింది. కొన్ని గంటలపాటు బయటనే కూర్చుని సర్ ఫామ్‌లు పరిశీలించారు.
ఆరుబయటే తహసీల్దార్ విధులు


