కరీంనగర్‌క్రైౖం: నగరంలోని కోతిరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం కోతిరాంపూర్‌కు చెందిన బండ మల్లేశం (45) గతంలో మేసీ్త్రగా పనిచేసేవాడు. ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యడు. బుధవారం రాత్రి మల్లేశం చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కాపర్ వైర్ చోరీ
మంథనిరూరల్: పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లకు కరెంటు సరఫరా అయ్యే వైర్ల నుంచి కాపర్ వైర్‌ను చోరీ చేసిన సంఘటన మంథని మండలం ఖానాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామశివారులోని గోదావరినది, బొక్కలవాగుల నుంచి సుమారు 30మంది రైతులు విద్యుత్ మోటార్లు అమర్చుకుని పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఆ విద్యుత్ మోటార్లకు సరఫరా అయ్యే వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసి అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గురువారం అటువైపు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. 30మంది రైతులకు సుమారు రూ.2నుంచి 3లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. కాపర్ వైర్ దొంగిలించిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జైలు
గోదావరిఖని: డ్రంకెన్ డ్రైవ్‌లో కేసులో ఆటో డ్రైవర్‌కు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన 8మందిని కోర్టులో హాజరుపర్చగా ఏడుగురికి రూ.21,000లు నగదు జరిమానా విధించగా, ఒకరికి జైలు శిక్ష విధించారన్నారు. అలాగే కమిటీ సర్వీస్‌లో భాగంగా రూ.3వేల నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు వారి ద్వారా అందించారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 13వ రాష్ట్రస్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ ఏర్పాట్లను గురువారం అసోసియేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు పరిశీ లించారు. 25జిల్లాల నుంచి 900 మంది బాల బాలికలు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీల ను ఉదయం 11గంటలకు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, ఫెడరేషన్ ఉపాధ్యక్షు డు మనోహర్‌లు ప్రారంభిస్తారని తెలిపారు.
12న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న ఉమ్మడి జిల్లా (పెద్దపల్లి మినహా) యూత్ జూనియర్స్ ఖేలో ఇండియా ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వై.మహేందర్‌రావు తెలిపారు. కోరుట్లలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9.30కు ఆధార్‌కార్డు జిరాక్స్‌తో రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రతిభ చాటే క్రీడాకారులు ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. వివరాలకు ఏ.రవీందర్ 98484 39349 సంప్రదించాలని సూచించారు.
ఎస్సారార్‌లో జాబ్‌మేళా
కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ కళాశాలలో ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎన్‌ఐఐటీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ప్రాసెసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీశ్ మాట్లాడుతూ ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా కళాశాలలో జాబ్ మేళాలు, క్యాంపస్ నియామకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్రైవ్‌కు 50 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ కె.సుధాకర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హర్‌జ్యోత్ కౌర్, సీనియర్ కౌన్సిలర్లు మనోజ్ కుమార్, రాకేశ్ పాల్గొన్నారు.


