రామగుండం: స్థానిక జె డ్పీ(పీఎంశ్రీ) హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు గ డ్డం జగదీశ్వర్ భారత గురురత్న అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా అవార్డుకు ఎంపికైనట్లు శుక్రవారం తెలిపారు. ఈనెల 6న హైదరాబాద్‌లో ఆయనకు అవార్డు ప్రదానం చేయనున్నారన్నారు. హెచ్‌ఎం అజ్మీరా శారద, ఉపాధ్యాయులు అభినందించారు.
ఘనంగా గాజుల మహోత్సవం
ఫెర్టిలైజర్‌సిటీ: గౌతమినగర్ శ్రీవాసవీకన్యకా పరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం 1.8లక్షల గాజుల మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
‘రాజ్’గా కాదు.. రక్షకుడిగా ఉంటా
గోదావరిఖని: రాజ్‌గా కాకుండా అందరికీ రక్షకుడిగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అభయం ఇచ్చారు. స్థానిక కెమెస్ట్రీ భవన్‌లో పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మా ట్లాడారు. నగర అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య వర్గాల పాత్ర కీలకమని అన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నగర అభవృద్ధిలో వ్యాపారులు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రజుమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
55 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
పెద్దపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, గురుకుల విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులను వివిధ కేటగిరీల్లో ఉత్తములుగా ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, ఓదెల, పాలకుర్తి, జూలపల్లి, ముత్తారం, రామగిరి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. జీహెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎస్‌జీటీ, పీఈటీ, టీజీటీ, పీజీటీ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బంది తదితర విభాగాల నుంచి ఉపాధ్యాయులకు ఇందులో చోటు కల్పించినట్లు వివరించారు. ఎంపికై న వారిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అవార్డులు అందస్తారని వివరించారు.
‘చేయూత’కు దరఖాస్తుల వెల్లువ
పెద్దపల్లి: జిల్లాలో చేయూత పింఛన్‌ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు మంజూరు చేస్తామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సుమారు మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించడంతో వివిధ వర్గాలవారు భారీసంఖ్యలో అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు తదిత రులు పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పెద్దపల్లిలో వితంతువులు 7,212 మంది, ఒంటరి మహిళలు 871 మంది, దివ్యాంగులు 2,839మంది, చేనేత కా ర్మికులు 475మంది, గీత కార్మికులు 1,365 మంది దరఖాస్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు గడు వు ఉందని, ఈలోగా అర్హులైన వారందరూ దర ఖాస్తు చేసుకోవాలని, దళారులను ఆశ్రయించొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.


