ధర్మారం/పెద్దపల్లి/గోదావరిఖని: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శుక్రవారం వంటావార్పు చేపట్టారు. ధర్మారం అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆఽ ద్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద ప్రకటించిన రూ.లక్షా నూట పదహార్ల ఆర్థిక సాయం అందించడంతోపాటు తు లం బంగారం ఇచ్చేవరకూ ఆ పార్టీ నేతలను వివా హాలకు ఆహ్వానించొద్దని తీర్మానించినట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మూల విజయారెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై నిరసన తెలిపారు. మహిళలు బతుకమ్మ ఆడి, వంటావా ర్పు చేశారు. నాయకులు కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, నడిపెల్లి మురళీధర్‌రావు, మహేశ్, కర్క పద్మజ, రమేశ్, మందల కిషన్‌రెడ్డి, నారాయణ, మేకల సమ్మన్న, తస్నిమ్‌భాను, అనుముల కళావతి, పర్ష స్వాతి, బోడకుంట వెంకటలక్ష్మి, శాంతిలక్ష్మి, కృష్ణవేణి, రంగు దుర్గాప్రసాద్, కంకల దేవేందర్, ఎర్రవెల్లి శ్రీనివాసరావు, నిజాముద్దీన్ పాల్గొన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వంటావార్పు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈసందర్భంగా వంటావా ర్పు, బతుకమ్మ ఆడుతూ మహిళలు, రైతులు తదితరులు నిరసన తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మమతారెడ్డితోపాటు ధర్మారంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, కరుణశ్రీ, రాసూరి శ్రీధర్, ఎలేటి కృష్ణారెడ్డి, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, తుమ్మల రాంబాబు, ఆవుల వేణుగోపాల్, అమరపెల్లి నారాయణ, దే వి నళినికాంత్, కాంపెల్లి అపర్ణ, ఆవుల లత, విజ య పాల్గొన్నారు.
పెద్దపల్లి : మాట్లాడుతున్న దాసరి మనోహర్‌రెడ్డి
గోదావరిఖని: ర్యాలీలో చందర్, నాయకులు


