రామగిరి: వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూ గర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జలశక్తి అభియాన్ సెంట్రల్ అసిస్టెంట్ డైరెక్టర్ చైతన్య అన్నారు. గురువారం మండలంలోని బుధవారంపేట, బేగంపేట గ్రామాల్లో పర్యటించి ఇంకుడు గుంతలను పరిశీలించారు. ప్రతీ రైతు తమ పొలా ల్లో ఫాంపాండ్, ప్రతీ గ్రామస్తుడు తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకో వాలని సూచించారు. ఎంపీడీవో శైలజారాణి, ఆయా గ్రామాల సర్పంచులు కన్నూరి రవీందర్, మంథెన చంటి, ఈసీ మౌనిక, టీఏ అఖిల, సెక్రటరీలు రాకేశ్, రత్నాకర్ పాల్గొన్నారు.


