పకడ్బందీగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

కోల్‌సిటీ: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై గు రువారం రామగుండం నగరపాలక సంస్థ కా ర్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గతంలో కంటే మరింత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనోత్సవం జరిగేలా భారీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణేశ్‌ విగ్రహాలు గోదావరి బ్రిడ్జి వద్దకు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించాలని అన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ ద్వారా ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నందున అక్రమంగా, ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలను లైన్లకు తగిలించవద్దని హెచ్చరించారు. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో సంస్థలు గతేడాది కంటే మెరుగైన ఏర్పా ట్లు చేయాలని అన్నారు. విగ్రహాలు సాఫీగా తరలేలా యుద్ధప్రాతిపదికన రోడ్లపై గుంతలు పూడ్చాలని, రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. కమి షనర్‌ జె. అరుణశ్రీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు, నిమజ్జనోత్సవా నికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో పవిత్ర, ఏసీపీ (ట్రాఫిక్‌) శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ, సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, పోలీసు అధికారులు, హెచ్‌కేఆర్‌ ప్రతినిధులు, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌, హిందూ వాహిని ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

నేడు మాంసం విక్రయాలు బంద్‌

కోల్‌సిటీ: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మాంసం విక్రయాలు నిలిపివేయాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.అరుణశ్రీ కోరారు. ఈ మేరకు స్థానిక మాంసం వ్యాపారులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే వ్యాపారస్తుల లైసెన్స్‌లు రద్దు చేయడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేపు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

పెద్దపల్లిరూరల్‌: జాతీయ ఉపాధ్యాయ దినోత్స వం పురస్కరించుకొని జిల్లాలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 5న అవార్డులు ప్రదానం చేస్తామని జిల్లా విద్యాధికారి శారద తెలిపారు. ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులంతా హాజరు కావాలని కోరారు.

5నుంచి సదరం శిబిరాలు

కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో దివ్యాంగుల వైకల్య నిర్ధారణ, సదరం ధ్రువీకరణ పత్రాల కోసం ఈనెల 5నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆర్‌ఎంవో డాక్టర్‌ కృపాభాయి తెలిపా రు. 5న కంటి వైద్యం (అప్తాల్మాలజీ), 7న జనరల్‌ వైద్యం, 8న ఎముకలు, కీళ్ల వైద్యం (ఆర్థోపెడిక్స్‌), 9న చెవి, ముక్కు, గొంతు వైద్యం (ఈఎన్‌టీ), 10న ఎముకలు, కీళ్ల వైద్యం (ఆర్థోపెడిక్స్‌), 11న మానసిక వైద్యం (సైకియాట్రీ) వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సద రం సర్టిఫికెట్‌ల కోసం సంబంధిత తేదీల్లో జీజీహెచ్‌కు హాజరుకావాలని సూచించారు.

జలసిరి పనులు

వేగవంతం చేయాలి

రామగిరి: తెలంగాణ జలసిరి–జల సంచాయ్‌, జన భాగిదరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవరావు ఆదేశించారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో గురువారం తెలంగాణ జలసిరి, జల సంచయ్‌, జన భాగీదారి, వీబీజీ రామ్‌జీపై ఉపాధి హామీ సిబ్బంది, పంచాయితీ సెక్రటరీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని పనుల పురో గతి, గ్రామసభల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఎంపీడీవో బి.శైలజారాణి, ఎంపీవో సమ్మిరెడ్డి, ఈసీ మౌనిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement