ఇది రాఘడవాపూర్ ప్రభుత్వ పాఠశాల భవనం. భవనం గోడలోనే రావిచెట్టు పుట్టుకొచ్చింది.. అంతే కాదు దానిని చీల్చుకుంటూ తరగతి గదిలోకి ఊడలు వచ్చిచేరాయి. గోడ పటిష్టత కోల్పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. శిథిలమైన ఈ భవనంలోని ఓ గదిలోనే రేషన్ డీలర్ సబ్సిడీ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో ఏదైనా అనూహ్య ఘటన జరిగితే బాధ్యులెవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
రాఘవాపూర్ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలమైంది. దాన్ని కూల్చివేయించే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి అనుమతి, సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– సురేంద్రకుమార్, ఎంఈవో
రాఘవాపూర్ ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైంది. నిరుపయోగమైన భవనాన్ని కూల్చివేయించాలి. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించాం. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
– కల్లెపల్లి అశోక్, గ్రామస్తుడు
శిథిలమైన భవనం కూల్చి.. ఆ స్థలంలో మహిళా సంఘ భవనం, లైబ్రరీ నిర్మిస్తే మేలు చేకూరుతుంది. గోడల్లో పెరుగుతున్న చెట్లతో ప్రమాదం పొంచిఉంది.
– తాడిచెట్టి చామంతి, సర్పంచ్


