నూతన సాంకేతిక వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

నూతన సాంకేతిక వినియోగించాలి

Aug 19 2026 1:06 AM | Updated on Aug 19 2026 1:06 AM

యైటింక్లయిన్‌కాలనీ: ఉపాధ్యాయులు బోధనలో కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ నిరంతరం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాని సింగరేణి స్కూల్స్‌ ఎడ్యుకేషనల్‌ సెక్రటరీ రాజేంద్రప్రసాద్‌ సూచించారు. సెక్టార్‌–3 సింగరేణి సీబీఎస్‌ పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలసుకున్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పాఠశాల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని అన్నారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. సింగరేణి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ బోధన పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సింగరేని పాఠశాల కరస్పాండెంట్‌ వేణుగోపాల్‌, హెచ్‌ఎం స్వర్ణలత, ఉపాధ్యా యులు, పేరెంట్స్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లిలో చైన్‌స్నాచింగ్‌

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని లక్ష్మీనగర్‌ (పదోవార్డు)లో నూనె స్వరూప మెడలో నుంచి బంగారు గొలుసు, మంగళసూత్రం తెంపుకుని పరారయ్యారు. సోమవారం రాత్రి స్వరూప తన ఇంటిముంగు అటూఇటు నడుస్తుండగా పల్సర్‌ బైక్‌పై వచ్చిన అగంతకులు 4తులాల బంగారు గొలుసులను అపహరించుకుపోవడం కలకలం సృష్టించింది. దొంగలు హిందీ భాషలో మాట్లాడుకున్నట్టు బాధితురాలు తెలిపింది. సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు యథేచ్ఛగా వచ్చి చోరీలకు పాల్పడడం చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్‌ పోలీసు సిబ్బందితో వచ్చి ఘటనపై ఆరా తీశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు.

గంజాయి తాగుతున్న ఇద్దరిపై కేసు నమోదు

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని గొల్లపల్లి రోడ్‌లో మంగళవారం సాయంత్రం గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. నిందితులకు పరీక్షలు చేయగా.. గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యిందని ప ట్టణ ఎస్సై సుప్రియ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్లు కుమారస్వామి పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి తీవ్ర గాయాలు

వేములవాడ: పట్టణంలోని గుడి చెరువు కట్టకింది బస్టాండ్‌ నుంచి శాత్రాజపల్లి వెళ్లే రోడ్డులోని పెట్రో ల్‌ బంక్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాలక్ష్మివీధికి చెందిన ఏదుల భూమ య్య, కొండయ్యకు తీవ్రగాయాలయ్యాయి. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement