రామగుండం: డ్రగ్స్ వినియోగంతో యువత భవిష్యత్ చిత్తవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా పెట్టాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం అంతర్గాం జంక్షన్‌లో మాదవద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటస్వామి, ఎంఈవో సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇష్టపడి చదవాలి
ఓదెల(పెద్దపల్లి): విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ అన్నారు. గురువారం ఓదెల మోడల్‌స్కూలులో పదో తరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్‌లతో పాటు మెటీరియల్ అందజేసి మాట్లాడారు. విద్యార్థి దశలో 25ఏళ్లు కష్టపడితే జీవితంలో 75 ఏళ్లు సుఖపడతారన్నారు. విలువైన సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ మెరిట్ సాధించాలన్నారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై రమేశ్, ఎంఈవో రమేశ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


