ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా..? | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా..?

Mar 13 2026 8:58 AM | Updated on Mar 13 2026 8:58 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో నెలకొన్న ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి, ఎవరికీ చెప్పకుండా జైలుకు పంపడమేంటని సీపీఎం జిల్లా కార్యదర్శి యాకయ్య ప్రశ్నించారు. రాఘవాపూర్‌ పంచాయతీ వార్డు సభ్యుడు, సీపీఎం నాయకుడు కల్లెపల్లి అశోక్‌, నవీన్‌ జైలు నుంచి విడుదల కాగా, గురువారం నాయకులు సత్కరించారు. గ్రామంలోని శ్మశానవాటిక స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పేదలు ఇబ్బందిపడతారని, సోలార్‌ప్లాంట్‌ను మరో ప్రాంతానికి తరలించాలని శాంతియుతంగా కోరితే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు. కనీసం వారి కుటుంసభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా జైలు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, భిక్షపతి, రవీందర్‌, జ్యోతి, లక్ష్మారెడ్డి, శ్రావణ్‌, రామలక్ష్మి, శ్రీశైలం, ప్రకాశ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement