● 2019లో ప్రారంభించి, 15 మందికి ఉపాధి
● ఆదర్శంగా నిలుస్తున్న సుచరిత
జమ్మికుంట(హుజూరాబాద్): స్వయంకృషితో చిరుపరిశ్రమ ప్రారంభించి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట పట్టణానికి చెందిన సుచరిత. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన వర్మని సుచరిత, రమేశ్ దంపతులు. రమేశ్ ఎలక్టీషియన్. జీవనం కష్టంగా ఉన్న రోజుల్లో చిన్న ఆలోచనతో పెద్ద విజయం సొంతమైంది. కీర్తన మసాలా తయారీ, రిటైల్ అండ్ హోల్‌సేల్ పరిశ్రమను 2019లో ప్రారంభించారు. మొదట ముగ్గురు కుటుంబ సభ్యులు, రూ.3వే ల పెట్టుబడితో మసాలా ప్యాకెట్లు తయారు చేసి జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లోని కిరాణం షాపుల్లో హోల్‌సేల్‌గా విక్రయించారు. మెప్మా, నెహ్రూ గ్రూపుల సాయంతో 2022లో రూ.లక్ష రుణంతో వ్యాన్ కొనుగోలు చేశారు. పీఎంజీ ద్వారా రూ.5లక్షలు రుణంతో మిషన్ కొని మసాలాలు ప్యాకింగ్ చేసి వరంగల్, కరీంనగర్, జనగాం, పెద్దపల్లి, గోదావరిఖని తదితర పట్టణాల్లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. ఏడాదిలో రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తూ 15 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.
నెలకు రూ.50 వేల ఆదాయం
మసాలా తయారీ, అమ్మకంతో నెలకు ఖర్చులు పో నూ రూ.50వేల వరకు ఆ దాయం వస్తుంది. మసాలా తయారీ, ప్యాకింగ్ కో సం 15 మంది మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు జీతం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. స్వయంకృషితో తమ కుటుంబంతో పాటు పలువురికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.
– సుచరిత, కీర్తన మసాలా చిరు పరిశ్రమ, జమ్మికుంట
ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా దినోత్సవం
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా సిబ్బందితో కలిసి డాక్టర్ శ్రీధర్ కేక్ కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పలువురు మహిళా ఉద్యోగులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు వారికి అవసరమైన పథకాలు ప్రవేశ పెడుతు న్నాయని అన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏంవో విజయ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెండెలంట్ జమున, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


