నాడు బీడీకార్మికురాలు.. నేడు అధ్యాపకురాలు | - | Sakshi
Sakshi News home page

నాడు బీడీకార్మికురాలు.. నేడు అధ్యాపకురాలు

Mar 8 2026 7:19 AM | Updated on Mar 8 2026 7:19 AM

కరీంనగర్‌సిటీ: వారిది నిరుపేద చేనేత కుటుంబం.. తల్లీ బీడీ కార్మికురాలు.. తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చేస్తూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన శ్రీవాణి. ఆమె చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీ స్కూల్‌లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, కరీంనగర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకనామిక్స్‌లో ఫస్ట్‌ ర్యాంకుతో 3 బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవాణి విద్యారంగంలో అత్యున్నతంగా రాణిస్తున్నందుకు పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈసందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది మట్టిలో మాణిక్యాలు బయటి ప్రపంచానికి రాలేకపోతున్నారని, అలాంటివారిని గుర్తించి విద్యా పరిశోధనా రంగంలో తీర్చిదిద్దుతానని, శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement