జ్యోతినగర్: పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి మహిళల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తున్నారు. సీ్త్రలపై అణచివేత, అసమానతలకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నారు. సారా, మద్యపాన వ్యతిరేక, మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. గ్రామాల్లో మహిళలకు కూలిరేట్ల పెంపుపైనా పోఉ చేశారు. 2006లో పెద్దంపేట ఎంపీటీసీగానూ ప్రజాసేవలో పాలుపంచుకున్నారు. 991లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో చేరారు. మహిళలపై అన్యాయాలు, వేధింపులు ఉద్యమాల వైపు మళ్లించాయి. మహిళల చైతన్యానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మహిళల హక్కులు, స్వయం ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికల విద్యపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని జ్యోతి సూచిస్తున్నారు.


