
ఆనకట్ట కట్టలేదు.. నీళ్లు ఆపుతలేరు
మంథనిరూరల్: నాడు గోదావరి నదిపై ఆనకట్టలు కట్టాలని, ఇప్పుడు వృథాగాపోతున్న వరదనీటిని ఆపాలని మంథని ఎమ్మెల్యే ఏనాడూ ఆలోచన చే యలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. గోదావరి విలాపం పేరిట మంగళవారం సిరిపురం సమీపంలోని పార్వతీ బరాజ్‌ను సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి విషం చిమ్ముతున్నారని, మంథని ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తుతున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ బరాజ్ దెబ్బతింటే లోపంలేనిపార్వతీ బరాజ్ గేట్లు ఎత్తి నీటిని ఎందుకు దిగువకు వదులుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెంటనే గేట్లు మూసి నీళ్లు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్‌లాల్, గుజ్జుల రాజిరెడ్డి, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, కొండా రవీందర్, మిర్యాల ప్రసాదరావు పాల్గొన్నారు.