ఒక్కో పనికి ఒక్కోరేటు | - | Sakshi
Sakshi News home page

ఒక్కో పనికి ఒక్కోరేటు

Aug 21 2025 7:02 AM | Updated on Aug 21 2025 7:02 AM

ఒక్కో

ఒక్కో పనికి ఒక్కోరేటు

● ఈ ఏడాది ఫిబ్రవరి 20న మంథనికి చెందిన రైతు సువర్ణ క్రాంతినాగ్‌ భూమి సర్వే రిపోర్టు ఇచ్చేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలోని సర్వేయర్‌ జాటోత్‌ గణేశ్‌ రూ.17వేల డిమాండ్‌ చేశారు. తొలివిడత రూ.9 వేలు తీసుకొని మరో రూ.3వేలు రెండో వాయిదాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ● రెండేళ్ల క్రితం మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో విద్యుత్‌ శాఖలోని రూరల్‌ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ● అయితే, చాలా మంది ఏసీబీకి చిక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

పైరవీలకే పెద్దపీట ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబరు 1064కు కాల్‌చేయండి

మంథని: జిల్లాల పునర్విభజన తర్వాత ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ పెరిగి పరిపాలన మరింత మెరుగుడుతుందని అందరూ ఆశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా త యారైంది. కలెక్టర్‌తోపాటు ఒకట్రెండు ప్రభుత్వ శాఖలు పాలనను సాఫీగా పర్యవేక్షిస్తుండగా.. మిగతా శాఖల ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో కిందిస్థాయిలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

అదుపులేని అవినీతి..

రెవెన్యూ, కార్మిక, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, స బ్‌ ట్రెజరీ, సబ్‌ రిజిష్ట్రార్‌, ఎకై ్సజ్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోషల్‌ వెల్పేర్‌, ఆర్‌ అండ్‌ బీ, విద్య, వైద్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌, వ్యవసాయ, పశుసంవర్ధక, నీటిపారుదల, సీ్త్ర,శిశు సంక్షేమం, దివ్యాంగులు, అట వీ, కరెంట్‌ తదితర శాఖల్లో అవినీతికి హద్దూఅదు పు లేకుండాపోతోంది. మారుమూల ప్రాంతం మంథని నియోజకవవర్గంలో ప్రజలు తమ పనుల పూర్తికి పడుతున్న తిప్పలు అన్నీఇన్నీకావు.

విభాగాల చొప్పున పైరవీకారులు

జిల్లాలోని కొన్నిముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు పైరవీకారులు పుట్టుకొస్తున్నారు. నిత్యం ప్రజావసరాలు ఉండే.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, రేషన్‌, లేబర్‌ కార్డులు, కుల, కుటుంబసభ్యుల సర్టిఫికెట్లు, బ్యాంకుల్లో ఎన్‌వోసీలు, విద్యుత్‌.. ఇలాంటి విభాగాల్లో పనులు కావాలంటే పైరవీకారులను సంప్ర దించాల్సిందే. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా.. ఎవరు అధికారంలో ఉంటే వారి మద్దతుతోపాటు అధికారుల అండదండలతో పనులు చక్కబెడుతున్నారు. అధికారులు సైతం వారికి రాచమర్యాదలు చేస్తున్నారు.

అందుబాటులో ఉండని అధికారులు

మంథని డివిజన్‌లోని కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం లేదు. ఫీల్డ్‌ విజిట్‌ పేరిట సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనుల పర్యవేక్షణ పేరిట కార్యాలయాలకే రాకపోవడం, వచ్చినా చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం తప్ప పనులేమీ చేయడం లేదంటున్నారు. దీంతో మంది ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు..

ఏసీబీ దృష్టి సారిస్తే..

ప్రభుత్వ శాఖల్లో మితిమీరిన అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఏసీబీపై అవగాహన ఉన్న కొందరు.. అధికారులను ఆశ్రయిస్తున్నారు. కానీ, చాలామందికి అవగాహన, సమాచారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

1064కు కాల్‌చేయండి

ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబరు 1064కు కాల్‌చేసి సమాచారం అందించండి. పనిచేసేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు లంచం అడిగితే ఫిర్యాదు చేయొచ్చు. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతాం. సమస్యలు పరిష్కరించేలా, పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకుంటాం.

– విజయ్‌కుమార్‌, డీఎస్పీ,

అవినీతి నిరోధక శాఖ, కరీంనగర్‌

మంథనికి చెందిన శ్రీకాంత్‌ ఓ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగి. ఓ గ్రామ శివారులో కొన్ని భూములు ఉన్నాయి. వాటికి తాతల కాలం నుంచి పట్టా ఉంది. ఇందులో కొంత ఇతరుల పేరిట మారింది. రికార్డు ల్లో సరిగ్గానే ఉందని బాధితుడు దర ఖాస్తు చేస్తే.. సాంకేతిక సమస్య అని అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. సెలవులు పెట్టుకొని వచ్చి రెవెన్యూ కార్యాలయంలోని అధికారులను సంప్ర దించినా పనికాలేదు. విసిగిన బాధితుడు.. తన సమస్యను ఓ వ్యక్తికి మొరపెట్టుకున్నాడు. ఆయన సలహా మేరకు పైరవీకారుడిని కలిసి కొంత సొమ్ము ముట్టజెప్పడంతో పనిఅయిపోయింది. అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య డబ్బు ముట్టగానే పరిష్కారం కావడంతో అవాక్కయ్యాడు.

ఒక్కో పనికి ఒక్కోరేటు1
1/1

ఒక్కో పనికి ఒక్కోరేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement