
టెండర్లకు వేళాయె
మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధం పెరిగిన లైసెన్స్ ఫీజు .. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్
సాక్షి పెద్దపల్లి: మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 – 27 ఆర్థిక సంవత్సరం దుకాణాల కాలపరిమితికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చేడిసెంబర్ ఒకటో తేదీతో ప్రస్తుత దుకాణాల లైసెన్స్ గడువు ముగియనుండగా.. టెండర్ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నవారికి సర్కారు కిక్కులాంటి శుభవార్త చె ప్పింది. దీంతో ప్రస్తుతం మద్యం దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారులతోపాటు గతంలో లక్కీడ్రాలో అ దృష్టం వరించనివారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. గత ప్రభు త్వం ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ లకు 15 శాతం ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం క ల్పించిన విషయం విదితమే. ఈసారి కూడా అదేవిధంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నది. ఈ ఏ డాది గతం కంటే పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గతంలో కంటే పోటీ ఎక్కువగా ఉండనున్నదని భావిస్తున్నారు.
గతంలో 77 షాపులకు 2,022 దరఖాస్తులు
జిల్లాలో 14 మండలాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 77 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో 2,022 దరఖాస్తులు రావడంతో సర్కారు ఖజానాకు రూ.40.44 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది స్థానిక ఎన్నికలు, సమ్మక్క – సారక్క జాతర నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీస్థాయిలో ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. దీంతో పెద్దసంఖ్యలో వ్యాపారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల ఫీజు
జిల్లాలోని 77 మద్యం దుకాణాల్లో రిజర్వ్ దుకాణా లు మినహా ఒక్కోవ్యక్తి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. జిల్లాకేంద్రంతోపాటు రాష్ట్రంలోని ఏ మద్యం దుకాణానికై నా టెండర్ వేసే వీలుంది. ఒక్కో దరఖాస్తుకు గతంలో రూ.2 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.3లక్షలకు (నాన్ రిఫండేబుల్) నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు ను రూ.3 లక్షల డీడీతో లేదా చలాన్ ద్వారా చెల్లించవచ్చు. రెండుమూడ్రోజుల్లో జిల్లాల వారీగా నోటి ఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు ప్రణాళిక రూపొందించారు.