ప్రభుత్వాన్ని నిలదీద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Aug 21 2025 7:02 AM | Updated on Aug 21 2025 7:02 AM

ప్రభు

ప్రభుత్వాన్ని నిలదీద్దాం

మంథని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్ర భుత్వాన్ని నిలదీద్దామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగా అన్నా రు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు నె రవేర్చే వరకు పోరాటం కొనసాగిద్దామని కో రారు. ఏపూరి వెంకటేశ్వరరావు, అంబాల రా జేందర్‌, గోపాల్‌, పల్లె బాపు, నరిగ మల్లేశ్వరి, మంథని చందు, ఐరెడ్డి నారాయణరెడ్డి, మడిపల్లి దశరథం, కేసారపు నరేశ్‌, అసం తిరుపతి. మంథని లక్ష్మణ్‌, శ్యాం, రవి పాల్గొన్నారు.

నియామకం

గోదావరిఖనిటౌన్‌: స్థానిక పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇనుగాల మనోహర్‌ను నియమించా రు. ఈమేరకు యూనివర్సిటీ రిజిష్ట్రార్‌ బుధ వారం ఆదేశాలు జారీచేశారు. మనోహర్‌ యూ నివర్సిటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. బోధన, బోధనేతర సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించారు. అధ్యాపకులు రమాకాంత్‌, ఎన్‌వీ రంగప్రసాద్‌, రవి, ప్రసాద్‌, శ్యాంకుమార్‌, సుధ, రమ్య, శ్రీనివాస్‌, రవీందర్‌, శంకర్‌, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభం

గోదావరిఖని: నేరస్తులకు శిక్షపడేలా సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బ లోపేతం చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. పోలీస్‌ కమిషనరేట్‌కు కేటాయించిన ఫోరెన్సిక్‌ మొబైల్‌ వా హనాన్ని సీపీ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక పరికరాలతో రూపొందించిన వాహనాన్ని సద్విని యోగం చేసుకుని నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ మల్లారెడ్డి, ఏవో శ్రీనివా స్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ అ సిస్టెంట్‌ డైరెక్టర్‌ రాము, సీఐలు రవీందర్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, ఆర్‌ఐలు దామోదర్‌, మల్లేశం, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి ని ల్వసామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 14.89 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న భారీ ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు 40 గే ట్లు ఎత్తి 5,35,282 క్యూసెక్కులను దిగువన ఉ న్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎ స్సారెస్పీ నుంచి 2,49,400 క్యూసెక్కులు, క డెం నుంచి 7,028 క్యూసెక్కులు, వరదనీరు 2,29,771 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తోంది.

ప్రజల జీవనస్థితిపై సర్వే

పెద్దపల్లిరూరల్‌: ప్రజల జీవనస్థితిగతులు, ప్ర జారవాణా సౌకర్యాలు తదితర అంశాలపై జా తీయ గణాంక అధికారులు బుధవారం జిల్లా కేంద్రంలో సర్వే చేశారు. పల్లె, పట్టణ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితి, ఉపాధి అవకాశాలపై ఆరా తీసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు జా తీయ గణాంక అధికారి సుధాకర్‌ తెలిపారు. దేశంలో తొలిసారి చేపట్టిన ఈ సర్వే ద్వారా ప్ర జారవాణా ఎలా ఉందనే విషయమై సమగ్ర స మాచారాన్ని సేకరించి ఆ వ్యవస్థను మరింత బ లోపేతం చేసేందుకు వీలుగా ప్రణాళిక రూ పొందిస్తామని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, తహసీల్దార్‌ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌, స్టాటిటికల్‌ అధికారులు శ్రీనివాస్‌, వెంకటేశ్‌, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

దోమలను నిర్మూలించాలి

పెద్దపల్లిరూరల్‌: దోమల నిర్మూలనతోనే వ్యా ధులు దూరమవుతాయని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి అన్నారు. ‘వరల్డ్‌ మస్కి టో డే’ సందర్భంగా స్థానిక బస్టాండ్‌ వద్ద బుధవారం అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధి కారి శ్రీరాములు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఉమామహేశ్వర్‌, రవీందర్‌, అంజయ్య, రాజబాబు, రాకేశ్‌, అఫ్రోజ్‌ పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చైర్మన్‌

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను బుధవారం ఉన్నతస్థాయి అధికారులు సందర్శించారు. మరమ్మతు పనులు తనిఖీ చేశారు. ‘సాంకేతిక లోపమా? స్వయంకృతాపరాధ మా‘ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. దీంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ చైర్మన్‌ శరవరన్‌ కర్మాగారానికి చేరుకుని మరమ్మతులు తనిఖీ చేశారు. అధికారులపై మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని నిలదీద్దాం 1
1/1

ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement