
రాజీవ్ ఆశయ సాధనకు కృషి
సుల్తానాబాద్(పెద్దపల్లి): రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళి అర్పించారు. నాయకులు డి. దామోదర్‌రావు, అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్, సా యిరి మహేందర్, పన్నాల రాములు, బిరుదు కృష్ణ, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, తిరుమల్‌రావు, రఫీక్, పాహిం, వేగోళం శంకర్ పాల్గొన్నారు.
పెద్దపల్లిలో రాజీవ్‌గాంధీ జయంతి
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు అవినాష్, మస్రత్, మల్లయ్య, సంపత్, సుభాష్, జగదీశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీ మాన్, ఫణీంద్రభూపతి, శ్రీనివాస్, నదీం ఉన్నారు.