
సమన్వయ లోపమే కారణమా?
గోదావరిఖని: వరుస లాభాలు సాధిస్తున్న రామ గుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్) కొంతకాలంగా యూరియా ఉత్పత్తిలో వెనుకబడుతోంది. తరచూ మరమ్మతులతో షట్‌డౌన్ కావడంతో అమోనియా, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది.
యూరియా కొరతను అధిగమించేందుకే..
రాష్ట్ర అవసరాలు తీర్చుతూ, కొరతను అధిగమించ డం ధ్యేయంగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కె మికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)ను 17 ఫిబ్రవరి 2015న ఎఫ్‌సీఐ పాతస్లాంట్ స్థానంలో స్థాపించా రు. ప్రతీరోజు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోని యా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా డిజైన్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తరచూ మరమ్మతు చోటుచేసుకుని ఉత్పత్తిపై ప్రభా వం చూపుతోంది. ప్రధానంగా అమ్మోనియా పైపు లైన్‌ల లీకేజీలతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇలాంటి సమస్యలు గతంలో ఎదురైనా.. ఈసారి మరమ్మతులకు అధిక సమయం తీసుకుంటోంది.
దూరంలో కార్పొరేట్ కార్యాలయం
ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఢిల్లీలో నో యిడాలో ఉంది. దీంతో ప్లాంట్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఢిల్లీలోని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా మరమ్మతులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటు లో ఉండడంలేదు. దీంతో సమస్య జటిలంగా మారుతోంది. గ్యాస్ ఆధారితంగా నడిచే ప్లాంట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఏర్పడినా ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించడం కష్టంగా మారుతోంది.
ఐదు నెలల్లో మూడుసార్లు లీకేజీ..
గత ఐదునెలల్లో ప్లాంట్‌లో మూడుసార్లు యూరి యా, అమ్మోనియం ఉత్పత్తికి విఘాతం కలిగింది. గత మే 8 నుంచి జూన్ 15 వరకు ఉత్పత్తి నిలిచిపోయింది. జూలై 16 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఆగస్టు 14 నుంచి అమ్మోనియం లీకేజీతో ప్లాంట్‌ట్ షట్‌డౌన్‌లో ఉంది. అ మ్మోనియా పైపులైన్ లీకేజీలతె ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తోంది. వార్షిక మరమ్మతుల సమయంలోనూ సమయం అధికంగా తీసుకుంటోంది. అయినా, శాశ్వత ప్రాతిపదికన పనులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
20వేల టన్నులే సరఫరా
ఈఏడాది ఇప్పటి వరకు 65వేల టన్నులకు గాను 20వేల టన్నులను మాత్రమే రాష్ట్రానికి అందించింది. వరి సాగు మొదలైన క్రమంలో యూరియా ఉత్పత్తికి విఘాతం కలుగడం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్‌గా ఉంది. ఈక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాగూర్ మూడు రోజుల క్రితం ఆర్‌ఎఫ్‌సీఎల్ ఫ్లాంట్ సందర్శించి ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
మూడేళ్లలో సాధించిన
వార్షిక లాభాలు(రూ.కోట్లలో)
ఏడాది వార్షికాదాయం నికర లాభం
2022–23 4,586 8.59
2023–24 4,941 328.13
2024–25 5,291 413.30
సీబీఐతో విచారణ జరపాలి
ప్లాంట్ నిర్వహణపై ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమా న్యం తీరు అనుమానాస్పదంగా ఉంది. ఉత్పత్తి గురించి పట్టించుకోవడమే లేదు. ప్రమాదకరమైన అమ్మోనియా లీకేజీతో కార్మికులకు ప్ర మాదం పొంచిఉంది. షట్‌డౌన్ అయిన ప్రతీ సారి కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు వచ్చి నిర్ణయం తీసుకోవడంతో జా ప్యమవుతోంది. రైతులకు సకాలంలో యూరి యా అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఎఫ్‌సీఎల్ లక్ష్యం అందుకోలేకపోతోంది. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి.
– రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
ఉద్దేశపూర్వకంగా షట్‌డౌన్?
ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేస్తోందా? లేక తరచూ మరమ్మతులకు గురవుతోందా? అనే విషయంపై స్పష్టతకోసం రాజకీయ నేతలు పట్టుబడుతున్నారు. వార్షిక మరమ్మతులు పూర్తిచేసుకున్న తర్వాత కొద్దిరోజుల పాటు సజావుగానే ఉత్పత్తి సాగుతున్నా.. ఆ తర్వాతే షట్‌డౌన్ కావడంతో రైతులకు సకాలంతో యూరియా అందించలేకపోతున్నారు.