యూరియా కోసం బారులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం బారులు

Aug 19 2025 5:06 AM | Updated on Aug 19 2025 5:06 AM

యూరియ

యూరియా కోసం బారులు

ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక సహకార సంఘ కా ర్యాలయం ఎదుటు రైతులు సోమవారం ఉదయమే బారులు తీరారు. యూరియా లోడ్‌ వ చ్చిందనే సమాచారంతో ఒక్కసారిగా అన్నదా తలు తరలివచ్చారు. మొత్తం 1,320 బస్తాల యూరియా రాగా.. ఒక్కో ఎకరాకి ఒకబస్తా చొప్పున రైతులకు పంపిణీ చేసినట్లు ఏవో ఉ మాపతి తెలిపారు. యూరియా కోసం రైతులు అపోహ పడొద్దని, అవసరాలకు అనుగుణంగా అందిస్తామని ఏవో వివరించారు.

విగ్రహ ప్రతిష్ఠాపన

ధర్మారం(పెద్దపల్లి): ఖిలావనపర్తిలో సోమవా రం శ్రీమడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాయకులు ముత్యాల వీరస్వామి, గుడికందుల సురేశ్‌, లావుడ్య రూప్లానాయక్‌, పోల్‌దాసరి సంతోష్‌, తిరుపతిరెడ్డి, గందం మల్లయ్య, కొత్త నర్సింహులు, సోగాల తి రుపతి, జగన్‌మోహన్‌రెడ్డి, ఓరం చిరంజీవి, నూనే మల్లేశం, సాగంటి కొండయ్య, సోగాల మీనా, మోతె రవి, సంతోష్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఎత్తిపోతలు

ధర్మారం(ధర్మపురి): నందిమేడారంలోని నందిపంప్‌హౌస్‌ ద్వారా ఎల్లంపల్లి నీటిని ఆరు రో జులుగా ఎత్తిపోస్తున్నారు. తొలిరోజు మూడు విద్యుత్‌ మోటార్లను ఆన్‌ చేసిన అధికారులు.. క్రమంగా నాలుగింటిని ప్రారంభించి మేడా రం నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయిస్తున్నా రు. సోమవారం రెండు పంప్‌లతోనే నడిపించారు. ఒక్కోదాని నుంచి 3,150 క్యూసెక్కుల ను తరలిస్తున్నారు. ఇదే నీటిని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు ఎత్తిపోతలు కొనసాగుతాయని ఏఈ నర్సింగరావు తెలిపారు.

ఘనంగా వరదపాశం వేడుక

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): వెన్నంపల్లి–జాఫర్‌ఖాన్‌పేట గుట్టల్లోని పాండవలొంక జలపా తం వద్ద సోమవారం వరదపాశం లక్ష్మీదేవర బోనాలు వైభవంగా జరిగాయి. బోనాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలు, ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని మహిళా భక్తులు వరదపాయసం పోశారు.

టెక్నాలజీని వినియోగించాలి

రామగిరి(మంథని): మారుతున్న కాలానికి అ నుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపు చ్చుకోవాలని అల్ట్రాటెక్‌ ప్లాంట్‌ అధిపతి మంద ల శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ సూచించారు. పన్నూర్‌ జేఎన్టీయూలో ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్‌ హాజరై మాట్లాడారు. ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకుంటేనే భవిష్యత్‌లో రాణిస్తార ని అన్నారు. ఏసీపీ రమేశ్‌, సీఐ రాజుగౌడ్‌, ఎ స్సై శ్రీనివాస్‌, టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుధ్య సిబ్బందికి రెయిన్‌కోట్స్‌ అందజేత

కోల్‌సిటీ(రామగుండం): పారిశుధ్య సిబ్బందికి బల్దియా కమిషనర్‌ అరుణశ్రీ రెయిన్‌ కోట్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత రక్షణ కిట్లతోపాటు రెయిన్‌ కోట్లనూ ధరించాలని సూచించారు.

యూరియా కోసం బారులు 1
1/5

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు 2
2/5

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు 3
3/5

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు 4
4/5

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు 5
5/5

యూరియా కోసం బారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement