
రైతులూ.. ఆందోళన వద్దు
సాక్షి, పెద్దపల్లి: ‘జిల్లా అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి.. గతేడాదికన్నా 6,000 మెట్రిక్ టన్నులు అధికంగానే పంపిణీ చే శాం.. రైతులు ఆందోళన చెందొద్దు’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నాపారు. యూరియా లభ్యత, టామ్‌కామ్, ఏటీసీ, ఐటీఐ సీట్లు, టాస్క్ ఇందిర మ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వానాకాలం పంటలకు 28 వేల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చే శామన్నారు. ప్రస్తుతం 2,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో మ రో 300 మెట్రిక్ టన్నులు, ఈనెల 24న మరో వంద మెట్రిక్ టన్నులు ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి వ స్తుందని తెలిపారు. రైతులు అవసరం మేరకే కొ నుగోలు చేయాలని కోరారు. పదిరోజుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి 1,500 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెప్పించామన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోంచి మహారాష్ట్రకు కొంత అక్రమంగా తరలివెళ్తోందని, ముందుజాగ్రత్తగా మన జిల్లాలో కూడా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటామని తెలిపారు.
వెంటనే బిల్లులు మంజూరు
జిల్లాకు 6,400పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 3,926 మంది ముగ్గుపోశారని, 1,466 వరకు బేస్మెంట్ స్థాయిలో ఉన్నా యని కలెక్టర్ తెలిపారు. ఆధార్ ఆధారంగా ప్రతీ సోమవారం లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో బిల్లు డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఇలా ఇప్పటివరకు రూ.19.52 కోట్లు జమచేశామన్నారు. ఇ ళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు స్వశక్తి మహిళా సంఘాల నుంచి రూ.4.9కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, సభ్యత్వం లేని 10 కుటుంబాలకు కలెక్టరేట్ నుంచి రూ.లక్ష చొప్పు న రుణం మంజూరు చేశామని వివరించారు. కొత్తగా 12,165 కుటుంబాలకు రేషన్‌కార్డులు జా రీచేశామని, మరో 30 వేల మంది సభ్యులను రే షన్ పరిధిలోకి చేర్చామని అన్నారు. మీసేవ, ప్ర జాపాలన దరఖాస్తులనూ పరిశీలిస్తున్నామని, దీనిని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం
అగ్నివీర్ ద్వారా సైన్యంలో ఉద్యోగావకాశా లు కల్పించేందుకు 200 మంది ఆసక్తిగల అ భ్యర్థులకు సింగరేణి, ఎన్టీపీసీ సహకారంతో ఉచి తంగా శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. టామ్‌కామ్ ద్వారా విదే శాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 26న కలెక్టరేట్‌లో అవగాహన కల్పిస్తామని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పాసైన యువత ముందుకు వచ్చి టాస్క్ కోర్సుల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఐటీఐ, ఏటీసీల్లో ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచామని, సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని వివరించారు. భారీవర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్త్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు.