
లోలెవల్ వంతెనలు.. హైలెవల్ సమస్యలు
● మోస్తరు వర్షాలకే వరదలు ● స్తంభిస్తున్న రాకపోకలు ● పల్లెవాసులకు తప్పని తిప్పలు
కాల్వశ్రీరాంపూర్/మంథనిరూరల్/ఓదెల: సుల్తానాబాద్ – కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి – కాల్వశ్రీ రాంపూర్, జ మ్మికుంట – కాల్వశ్రీరాంపూర్, మంథని – కాల్వశ్రీ రాంపూర్ ఆర్ అండ్ బీ రోడ్లపై లో లెవల్ వంతెనలు కొద్దిపాటి వర్షానికే వరద ఉధృతి లో మునిగిపోతున్నాయి. మనుషులు, పశువులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల – గూడెం నక్కల వాగు ఒర్రెల్లో వరద ప్రవాహంలో గతేడాది ఎడ్లుబండి కొట్టుకుపోయాయి. స్థానికులు తాళ్లు వేయడంతో రైతు ప్రాణాలతో బయట పడ్డాడు. కొత్తపల్లి – మల్యాల మధ్య నక్కలవాగు ఒర్రెలో గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీన కారోబార్ పవన్ ప్రవాహంలో గల్లంతై మృతి చెందాడు. పెగడపల్లి – గంగారం మధ్య ఒర్రె, కూ నారం జగదాంబ ఒర్రె ప్రవాహంలో మనుషులు కొ ట్టుకుపోయిన ఘటనలూ ఉన్నాయి. 15 రోజుల కిందట వ్యవసాయ కూలీలు పోచంపల్లి–మల్యాల న క్కవాగు ఒర్రె తాత్కాలిక వంతెన దాటుతూ ప్రమాదానికి గురయ్యారు. రైతులు తాడుతో రక్షించారు. ఓదెల – కొలనూరు శివారు లోలెవల్ వంతెన పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.
ఇది మంథని – విలోచవరం మధ్యగల మెయిన్ రోడ్డు డ్యామ్. ఈ మార్గంలో పోతారం, ఉప్పట్ల గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేందుకు ఇదొక్కటే దిక్కు. వర్షం కురిస్తే ఎగువన ఉన్న నాగారం, గుంజపడుగు గ్రామాల చెరువులు మత్తడి దూకుతాయి. దీంతో రోడ్డు డ్యామ్ హఠాత్తుగా వరదనీటిలో మునుగుతుంది. రాకపోకలు స్తంభిస్తాయి. పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఇళ్లకు వెళ్లాలన్నా.. పనులకు పోవాలన్నా వరద వెంటాడుతూనే ఉంటుంది.

లోలెవల్ వంతెనలు.. హైలెవల్ సమస్యలు

లోలెవల్ వంతెనలు.. హైలెవల్ సమస్యలు