
బురద రోడ్డుపై వరినాట్లు
మంథని: స్థానిక పోచమ్మవాడ వాటర్ ట్యాంక్ సమీప బురదరోడ్డుపై మహిళలు ఆదివారం వ రినాట్లు వేసి నిరసన తెలిపారు. చిన్నపాటి వ ర్షానికి రోడ్లు బురదమయమై నడక నరకంగా మారిందని ఆవేదన చెందారు. సమస్యను ప ట్టించుకునేవారు కరువయ్యారని పేర్కొన్నారు. సిమెంట్ రోడ్లు మంజూరు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని మహిళలు కోరారు.
‘ఎల్లంపల్లి’ గేట్ల మూసివేత
రామగుండం: ఎగువ నుంచి వచ్చిన భారీ వ ర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద వచ్చి చే రడంతో శనివారం 20గేట్లు గేట్లు ఎత్తిన అధికా రులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆదివారం గేట్లు మూ సివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి కేవలం 20 వే ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. దీంతో గేట్లు పూర్తిగా మూసివేశారు. ప్రాజెక్టు ప్ర స్తుతం నీటినిల్వలతో జలకళ సంత రించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.28 టీ ఎంసీలు ఉంది. ఎగువ నుంచి 20,738 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. తద్వారా త్వరలోనే ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యానికి చేరనుంది. కాగా, హైదరాబాద్‌కు 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నందిపంపుహౌస్‌కు 12,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.
కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ రాజు కోరారు. స్థానిక బస్టాండ్‌లో ఆదివారం ఆయన కార్గో సేవలు ప్రారంభించి మాట్లాడారు. తక్కువ ధరల్లో ఎక్కువ సే వలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గోదావరిఖని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి, ఏజెంట్ రంజిత్, ప్రతినిధులు జక్కుల మల్లేశం, బస్టేషన్ ఇన్‌చార్జి ట్రాఫిక్ గైడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను ఆపేయండి
పెద్దపల్లిరూరల్: ఆదివాసీలపై కేంద్ర ప్రభు త్వం ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన మారణకాండను వెంటనే ఆపేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. ఈనెల 24న వరంగల్‌లో జరిగే బహిరంగసభ పోస్టర్, వాల్‌పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ కగార్ కోసం ఏ ర్పాటు చేసిన పోలీసు క్యాంపులను ఎత్తేయాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అటవీహక్కుల పరిరక్షణ, పె సా చట్టాలు, గ్రామసభ తీర్మాణాలను అమలు పర్చాలన్నారు. నాయకులు చంద్రమౌళి, వెంకటయ్య, మార్వాడీ సుదర్శన్, విశ్వనాథ్, రత్నకుమార్, గుమ్మడి కొమురయ్య, బాపు, రవి, ప్రసాద్, లెనిన్, రాజన్న, లక్ష్మణ్, వినోద్, రాజలింగు, రవీందర్, మల్లేశం, స్వామి ఉన్నారు.
సందర్శకుల సందడి
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో గోదావరిఖని, ఎన్టీపీసీ, పెద్దపల్లి, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. రద్దీతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు సందడిగా మారాయి.

బురద రోడ్డుపై వరినాట్లు

బురద రోడ్డుపై వరినాట్లు