గోదావరిఖని: అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలా లు అందేలా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు 111మందికి రూ. 1.11కోట్ల వి లువైన ఎమ్మెల్యే చెక్కులు, 4,687 కొత్త తెల్లరేషన్‌కా ర్డులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.7.56 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతర్గం, పాలకుర్తి మండల్లాలో రూ. 2కోట్ల చొప్పున కేటాయించి మహిళా భవన్‌లు నిర్మిస్తామన్నారు. రూ.25కోట్లతో సింగరేణి కార్మిక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ ఈశ్వర్, నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, గట్ల రమేశ్, తిప్పారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
రామగుండం: ఆబాది రామగుండంలో ముస్లిం శ్మ శానవాటికకు రహదారి సౌకర్యం కల్పించాలని మసీదు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఠాకూర్‌ను కలిసి విన్నవించారు. త్వరలోనే రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ నస్రీన్‌బేగం, కమిటీ ప్రతినిధులు ఉన్నారు.
దుర్మమ్మ జాతరకు హాజరు..
గోదావరిఖనిటౌన్: రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శ్రీకనకదుర్గ మాతా జాతర శోభాయాత్రకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి బోనంతో నైవేద్యం సమర్పించారు. నాయకు లు తాళ్లపల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.