
జిల్లాకు వర్షసూచన
పెద్దపల్లిరూరల్: జిల్లాలో సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు, కుంటల్లో నీటిని ల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదాల ని యంత్రణకు అధికారులు సహకరించాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు మనుగడ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎన్టీపీసీలో హరితసేన బాధ్యులు విత్తన గణపతి ప్రతిమలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆదివా రం విత్తన గణపతి ప్రతిమను స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ, గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసే నలో భాగంగా వేలాది మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీశ్, చెప్యాల రాజేశ్వర్‌రావు తదితరులున్నారు.