
సమస్యలపై నిరంతర పోరు
మంథని: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జనగామ రాజమల్లు అన్నారు. స్థానిక ఫ్రెండ్స్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన యూనియన్ జిల్లా నాలుగో మహాసభల్లో ఆయన మాట్లాడారు. కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అంతకుముందు పాతపెట్రోల్ బంక్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, నాయకులు మహేశ్, వెంకటస్వామి, బూడిద గణేశ్, చింతల గోవింద్, వడ్లకొండ రాజయ్య, ఆర్ల సందీప్, గొర్రంకల సురేశ్, మంథని లింగయ్య, బావు రవి, గడిపెల్లి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.