వర్షాకాలంలో ఎప్పుడు భారీ వర్షం పడినా మా ఊరికి వెళ్లే దారిలోని రోడ్డు డ్యామ్ వరదతో పొంగిపొర్లుతది. ఏటా నాలుగైదుసార్లు వరద వచ్చి రాకపోకలు నిలిచిపోతయి. రోడ్డుడ్యామ్ అవతల ఐదెకరాలు కౌలుకు తీసుకుని పంటలు ఏసిన. పొలంకాడికి పోయి రాత్రి ఇంటి రాంగ వరదతో గోసగోసతైంది.
– పుట్ట సంతోష్, రైతు, విలోచవరం
వంతెన నిర్మించాలి
కాల్వశ్రీరాంపూర్ – మొట్లపల్లి మధ్య మట్టలవాగుపై నా లుగు దశాబ్దాల కింద లోలె వల్ వంతెన నిర్మించారు. ఇ ప్పుడది శిథిలావస్థకు చేరింది. రైతులు, కూలీలు, వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకు పోతున్నాయి. హైలెవల్ వంతెన నిర్మాణం చేసి ఇబ్బందులు తొలగించాలి.
– రాంరెడ్డి, రైతు, మొట్లపల్లి
వర్షం పడితే అంతే..