యైటింక్లయిన్‌కాలనీ/సుల్తానాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలా గైనా వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్నెల్లుగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని సందేహాలు నివృత్తి చేస్తున్నారు.
21 నుంచి వార్షిక పరీక్షలు..
జిల్లాలోని మొత్తం 135 హైస్కూళ్లలో 7,393 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించే వార్షి పరీక్షలకు వీరు ఫీజు చెల్లించి ఉన్నారు. రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా..
జిల్లాలో మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా జిల్లా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. చూచిరాతలు, అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సౌకర్యంగా ఆర్టీసీ అధికారుల సహకారంతో బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటోంది.
అందుబాటులో వైద్య సిబ్బంది..
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలను నియమిస్తారు. వారి వద్ద ఓఆర్‌ఎస్‌తోపాటు ప్రథ మ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుతారు. తా గునీటి సౌకర్యం కల్పిస్తారు. నీడకోసం అవసరమై న చోట షామియానాలు ఏర్పాటు చేస్తారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, బుక్‌స్టాళ్లు మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.
నేరుగా హాల్‌టికెట్ల డౌన్‌లోడ్..
ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు నేరుగా htto:// bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికె ల్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ఫీజు తిప్పలు ఉండవు.
జిల్లా సమాచారం
టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం
విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న టీచర్లు
21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు