యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): పతనమవుతున్న మానవ విలువలను పెంపొందించడం.. మరుగున పడుతున్న నైతికతపై అవగాహన కల్పించడం.. క్రమశిక్షణతో ఉత్తమలుగా తీర్చిదిద్దడం.. అన్నింటికీ మించి కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన చేయ డం లక్ష్యంగా సింగరేణిలోని పాఠశాలలు తమదై ముద్ర వేసుకుంటున్నాయి. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా ఆధునిక వసతులతో ముందుకెళ్తున్నాయి.
సింగరేణి వ్యాప్తంగా 9 పాఠశాలలు..
తమ కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు సింగరేణి సంస్థ మొత్తం 9 పాఠశాలలు నిర్వహిస్తోంది. విద్యార్థుల ను చదువుతోపాటు ఆటాపాటల్లోనూ ఉత్తములుగా తీర్చిదిద్దుతోంది. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ మెరికల్లా తయారు చేస్తోంది. అర్హులైన, అనుభవంగల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యబోధన చేస్తోంది. ఆర్జీ–2 ఏరియాలోని సెక్టార్–3 పాఠశాల ఉత్తమ విద్యా బోధన చేయడంలో సంస్థ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. సింగరేణి చరిత్రలోనే తొలిసారి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు యైటింక్లయిన్‌కా లనీ సింగరేణి పాఠశాల ఎంపిక కావడం విశేషం. సీబీఎస్‌ఈ విద్యాబోధనకు అవసరమైన సౌకర్యాల కల్పన, యంత్రపరికరాలు సమకూర్చడం కోసం సింగరేణి ఇప్పటికే రూ.5 కోట్లు వెచ్చించింది.
పాఠశాలల ప్రత్యేకతలు ఇవే..
విద్యార్థులకు సకల సౌకర్యాలలో కూడిన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చిన యాజమాన్యం.. డిజిటల్ తరగతులు నిర్వహిస్తోంది. అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ప్రయోగశాలలు, కంప్యూటర్ శిక్షణ, కొత్త విషయాలపై అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ఆధునిక లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యోగా, ఆటల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీలోనూ ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తోంది. విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నిపుణులతో సదస్సులు, జనరల్ నాలెడ్జి టెస్ట్‌లు నిర్వహిస్తోంది. విజ్ఞాన పర్యటనలతో ఉత్సాహం నింపుతోంది. సైన్స్, మ్యాథ్స్, ఒలింపియాడ్స్‌లోనూ అవగాహన కల్పిస్తోంది. అన్నింటికన్నా విద్యార్థుల నడవడిక, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించేందుకు నిపుణులతో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కల్పనకు కార్యాచరణ రూపొందిస్తోంది.
స్కూళ్ల సమాచారం
సింగరేణిలోని మొత్తం స్కూళ్లు 9
ఉపాధ్యాయుల సంఖ్య 700
ఇందులో పర్మినెంట్ టీచర్లు 200
నాన్ టీచింగ్ స్టాఫ్ 50
తరగతులు 1 నుంచి – 10
మీడియం ఇంగ్లిష్
కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన
అందుబాటులో డిజిటల్ క్లాసులు
ఆధునిక కంప్యూటర్ ల్యాబ్
పాఠశాలల్లో ఎన్‌సీసీ శిక్షణ
సింగరేణి పాఠశాలల ప్రత్యేకత
నాణ్యమైన విద్య అందిస్తున్నాం
సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాల ల్లో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రధానంగా క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రత్యేకంగా నైతిక విలువలు పెంపొందించడం లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నైతిక విలువలు పెంపొందించడం ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఎంతోకీలకం. అందుకే సింగరేణి ఈ నిర్ణయం తీసుకుంది.
– సుందర్‌రావు, ప్రధానోపాధ్యాయుడు, సెక్టార్ –3 సింగరేణి స్కూల్
నైతికత.. క్రమశిక్షణ
నైతికత.. క్రమశిక్షణ
నైతికత.. క్రమశిక్షణ
నైతికత.. క్రమశిక్షణ