
పంపుహౌస్‌ను సందర్శించిన హైకోర్టు జడ్జి
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామ శివారులోని నంది పంప్‌హౌస్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరపల్లి నంద శనివారం సాయంత్రం సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిలోని నీటి ని ఎత్తిపోసేందుకు నంది పంప్‌హౌస్ నిర్మించారు. అయితే, హైకోర్టు జడ్జితోపాటు జిల్లా ప్రధాన న్యా యమూర్తి హేమంత్ కుమార్, నందిమేడారం జూనియర్ సివిల్ జడ్జి వెంకట్ సచిన్‌రెడ్డి, గోదావరిఖని జడ్జి వెంకటేశ్ ధ్రువ, తహసీల్దార్ రజిత, ఆర్‌ఐ వరలక్ష్మి పంప్‌హౌస్‌లోకి వెళ్లి పరిస్థితి తిలకించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి కాళేశ్వరం ప్రాజెక్టు డీఈఈ నర్సింగరావు, ఏఈఈ వెంకట్ తదితరులు పంప్‌హౌస్ నిర్మాణం, పనితీరు గురించి వివరించారు. అనంతరం నందిమేడారం జూనియర్ సివిల్ కోర్టుకు చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి.. జిల్లాలోని వివిధ ప్రాంతాల జడ్జిలతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మేడారం జూనియర్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ కొమురయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ ఆలయంలో పూజలు
పెద్దపల్లిరూరల్: హైకోర్టు జడ్జి జస్టిస్ సూరపల్లి నంద స్థానిక ఎల్లమ్మ ఆలయంతోపాటు సమీప హనమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. మినీ ట్యాంక్‌బండ్‌ను తిలకించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంత్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి తదితరులు జడ్జి వెంట ఉన్నారు.

పంపుహౌస్‌ను సందర్శించిన హైకోర్టు జడ్జి