
డీసీపీకి మహోన్నత సేవా పతకం
గోదావరిఖని: విధి నిర్వహణలో అత్యుత్త్తమ ప్రతి భ కనబరిచిన రామగుండం పోలిసు కమిషనర్ పరి ధిలోని పోలీసు అధికారులకు మహోన్నత సేవా, సేవా పతకాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా పనిచేస్తున్న సి.రాజుకు రాష్ట్ర పోలీస్ మహోన్నత సేవా పతకం ప్రకటించా రు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ టి.మల్లారెడ్డి, గోదావరిఖని టూటౌన్ ఎస్సై కళాధర్‌రెడ్డి, వన్‌టౌన్ ఏఎస్సై డి.స్వామి, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతికి సేవా పతకాలను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.
అగ్నిమాపక అధికారికి సేవా పతకం..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి అగ్నిమాపక శాఖ అధికారిగా పనిచేస్తున్న దేవనంది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించిన ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏటా ఈ పుర స్కారం అందిస్తోంది. పురస్కారంతోపాటు రూ.20వేల నగదు పారితోషికాన్ని శ్రీనివాస్‌కు అందించనుంది. పెద్దపల్లికి చెందిన శ్రీనివాస్.. 1993లో ఫైర్‌మన్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 2000లో ఫైర్‌డ్రైవ ర్‌గా పనిచేశారు. 2016లో ఫైర్ ఆఫీసర్‌గా పదోన్న తి పొందారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పనిచేశారు. 2022 జనవరి 9వ తేదీ నుంచి పెద్దపల్లిలో ఫైర్‌ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ సేవా పతకానికి ఎంపికై న శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు. తన సేవలను గుర్తించి పురస్కారం అందించేందుకు ఎంపిక చేసిన ఉన్నతాదికారులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు సేవా పతకాలు
ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం

డీసీపీకి మహోన్నత సేవా పతకం