నామినేషన్లకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు వేళాయె..

Apr 18 2024 2:00 PM | Updated on Apr 18 2024 2:00 PM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

సాక్షి, పెద్దపల్లి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ గు రువారం విడుదలకానుంది. 18 నుంచి ఈనెల 25వ తేదీ వరకు (ప్రభుత్వ పనిదినాల్లోనే) ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వ రకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రమైన పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా క లెక్టర్‌ ముజిమ్మిల్‌ఖాన్‌ వ్యవహరించనున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రె స్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పటికే తమ అభ్య ర్థులను ఖరారు చేశాయి. అంతేకాదు.. అధినేతలు నిత్యం పార్టీ శ్రేణులతో సమావేశమవుతూ ఎన్నికల పోరుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదేసమయంలో.. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు బలమైన ముహూర్తం చూసుకుంటున్నారు. తిథి, వారం, నక్షత్రం చూసుకొని తమకు కలిసి వచ్చేరోజు తెలుసుకొని మరీ నామినేషను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఏ రోజు ఎవరు..?

ఈనెల 19న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అదేరోజు కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన నామినేషన్‌ సమర్పించనున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ తన నామినేషన్‌ను ఈనెల 23, 24వ తేదీల్లో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

‘సువిధ’లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు

అభ్యర్థులు సువిధ యాప్‌లో నామినేషన్‌ ముందే అ ప్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడొచ్చు. నామినేషన్‌ పత్రాల్లో అన్ని అంశాలు పూరించాలి. ఆర్‌వో కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు మూడంచెల భద్రత కల్పించారు. మూడు కన్నా ఎక్కువ వాహనాలు అనుమతించరు. ఒకఅభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖ లు చేసుకోవచ్చు. ఎన్నికల వ్యయం నామినేషన్‌ దాఖ లు రోజునుంచే పరిగణనలోకి తీసుకుంటారు.

నిబంధనలివే..

● పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, నామినేషన్లు ఎలా సమర్పించాలో తెలియక చాలామంది పొరపాట్లు చేస్తుంటారు.. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవీ..

● పెద్దపల్లిలోని కలెక్టరేట్‌లోనే ఎవరైనా తమ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.

● నిర్ణీత గడువు వరకు అధికారులు రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు.

● అభ్యర్థితోపాటు నలుగురినే కార్యాలయంలోకి అనుమతిస్తారు. నామినేషన్‌ పత్రాలను అభ్యర్థి లేదా, ప్రతిపాదించిన వ్యక్తి ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

● గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే బలపరిచే వారు ఒక్కరు ఉంటే చాలు. అలా కానీ వారైతే 10మంది ఓటర్లు బలపరచాల్సి ఉంటుంది. పార్టీల ఏ–ఫారం, బీ–ఫారాలను కూడా ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటల్లోపు అధికారులకు సమర్పించాలి.

● నామినేషన్‌ సమర్పించే సందర్భంలో అభ్యర్థి నామినేషన్‌తో ఫారం–26 కూడా జతచేయాలి. అభ్యర్థి వేరే నియోజకవర్గానికి చెందితే.. ఓటరు జాబితా తప్పనిసరిగా సమర్పించాలి.

● అభ్యర్థి పంచాయతీకి, మున్సిపాలిటీకి పదేళ్లుగా పన్నుబకాయిలు ఉండకూడదు. దీనికి సంబంధించిన ధ్రువీకరణప్రతం జతచేయాలి.

● ఫారం–2 కూడా నామినేషన్‌ పత్రాలతో సమర్పించాలి. కోర్టు కేసులు ఉంటే మూడురోజులపాటు 12 కాలమ్స్‌లో పబ్లిష్‌ చేయాలి. దీనిని ఫారం–సీ–1లో పొందుపర్చాలి.

బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వాల్సిందే

అభ్యర్థులు తమ బ్యాంకు వివరాలు ఆర్వోకు అందజేయాలి. ఇందుకోసం జాతీయబ్యాంకు నుంచి కొత్తగా ఖాతా తెరవాలి. ఎన్నికలు పూర్తయ్యే వర కూ ఆ ఖాతా నుంచే లావాదేవీలు జరపాలి. జనర ల్‌ అభ్యర్థులు డిపాజిట్‌గా రూ.25వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.12,500 చెల్లించాలి. అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి ఎదుట ప్రమాణం చేయాలి. అలా చేయకుంటే నామినేషన్‌ చెల్లదు. అలాగే ఫారం–26లోని ప్రతీ కాలమ్‌ పూర్తిగా నింపాలి.

పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

పెద్దపల్లిరూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అడిషనల్‌ కలెక్టర్లు శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, అరుణశ్రీ హాజరయ్యా రు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, తుదిజాబి తా, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పేపర్‌ రూపకల్పన తదితర అంశాలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా చేపట్టాలని పెద్దపల్లి పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధి కారి ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. ఈ వ్యవహారమంతా వీడియో, ఫొటోగ్రఫీ జరగాలని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అ భ్యర్థి ప్రతిజ్ఞ రిటర్నింగ్‌ అధికారి ముందు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీరోజు దాఖలయ్యే నామినేషన్ల వివరాలను సెట్ల వారీగా సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆర్డీవోలు గంగయ్య, హనుమా నాయక్‌, ఏవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌, డెప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement