ఆ మొత్తానికే సంతకాలు.. | - | Sakshi
Sakshi News home page

ఆ మొత్తానికే సంతకాలు..

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

ఆ మొత్తానికే సంతకాలు..

పాలకొండ డివిజన్‌ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికల విధులు నిర్వహించిన ఓ ఉద్యోగికి రూ.1,350కి బదులు రూ.800 ఇచ్చారు. ఆ ప్రకా రం ఆయన వద్ద నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. ‘ఇంత దూరం వచ్చి విధులు నిర్వహించాం.. ఇందులోనూ కోత విధిస్తే ఎలా?’ అని సద రు ఉద్యోగి ప్రశ్నించగా.. భోజనం డబ్బులు మినహాయించుకున్నట్లు అధికారుల నుంచి సమాధా నం వచ్చింది. దీంతో నివ్వెరపోవడం సదరు ఉద్యోగి వంతైంది. ఇదే పరిస్థితి చాలా మందికి ఉందని ఆయన చెబుతున్నారు. చేసేదేమీ లేక కొందరు ఇచ్చిన మొత్తాన్ని తీసుకెళ్లగా, మరికొందరు ఉన్నతాధికారుల వద్ద వాపోయారు. ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని యూటీఎఫ్‌ జిల్లా శాఖ నాయకులు బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement