ఈ ఏడాది వరి పంట నష్టపోయాం. మొత్తం కుటుంబం అంతా కష్టపడితే కార్తీకంలో కూరగాయల సాగు ద్వారా నాలుగు పైసలు చూడగలం అనుకున్నాం. తీరా వరుస తుఫాన్లతో కూరగాయల పంటలన్నీ నష్టపోయాం. తీగ, పందిరి జాతి పంట లన్నీ పాడయ్యాయి. అధిక వర్షాలకు ఆకుకూరలు కూడా నాశనమయ్యాయి.
–కండాపు ప్రసాదరావు, రైతు, రుద్రిపేట, పాలకొండ మండలం
కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కొనలేకపోతున్నాం. వర్షాలకు కూరగాయల పంట లు పాడవ్వడంతో దిగుబడి తగ్గిపోయిందని చెబుతున్నా రు. అలాగే కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా కూరగాయలు ధరలు పెరిగిపోయాయి. దీంతో కిలో కొనాల్సి ఉండగా.. అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం. – సుంకరి ప్రసాద్, వినియోగదారుడు, పాలకొండ


