నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి భక్తుల కానుకల రూపంలో రూ.21,89,335 ఆదాయం సమకూరింది. ఈ మేరకు బుధవారం దేవస్థానంలోని ధర్మ హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. జూలై 2 నుంచి ఈ నెల 10 వరకు 132 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయశాఖ విజయనగరం డివిజన్ ఇన్‌స్పెక్టర్ శ్యాంప్రసాద్, కొట్టాం గ్రూప్ దేవాలయాల ఈఓ శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓలు రామారావు, లక్ష్మణరావు, శ్రీవారి సేవా భక్తులు పాల్గొన్నారు.


