సీతానగరం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ బి‘పోషణ్ బడాయి బి’ కార్యక్రమంపై సిబ్బంది అవగాహన కల్పించుకుని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ఐసీడీఎస్ బలిజిపేట సీడీపీఓ కె. రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యారంభ దశలోనే పిల్లలను సంరక్షించడం, మానసిక అభివృద్ధిని మెరుగు పర్చడం, ఆటల ఆధారిత విద్యనైపుణ్యతను పెంపొందించడం అంగన్వాడీ కార్యకర్తల బాధ్యత అని గుర్తుంచుకోవాలన్నారు. పుట్టిన నుంచి 3 సంవత్సరాల వయస్సు మధ్య గల పిల్లల సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల 141 యాక్టివిటీ గురించి ఆదర్శశీల 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో సమగ్రఅభివృద్ధి మెరుగు పర్చడంపై అవగాహన కల్పించారు. గృహసందర్శన, టీఎల్‌ఎన్ విధానం అమలుపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు బి.పద్మ, వై.రేవతి, బీపీసీ కామేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఎల్.దాలినాయుడు పాల్గొన్నారు.


