రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు హర్షవర్ధన్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు హర్షవర్ధన్‌

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కొత్తవలస మండలం దెందేరులో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి కరాటే పోటీల్లో గరివిడి పట్టణంలోని కొండపాలెం ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి బండి హర్షవర్ధన్‌ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అండర్‌–14 విభాగంలో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని తన ప్రతిభను చాటుకున్న హర్షవర్ధన్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 21 తరువాత రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయస్సులోనే కరాటేలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న హర్షవర్ధన్‌తో పాటు కోచ్‌ సిద్ధూను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.రాము, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ పి.సత్యన్నారాయణ, పీడీ టి.విజయలక్ష్మి, సహాపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement