కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆన్‌లైన్ ఫిర్యాదులపై అవగాహన అవసరం
పీజీఆర్‌ఎస్ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిన నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఇతర ఫిర్యాదుల స్వీకరణ మార్గాలపై అధికారుల స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే విధానం, సంబంధిత శాఖల కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న సేవలు, అత్యవసర సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన అధికారుల వివరాలను ప్రజలకు తెలియజేయాలి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అనుమతించిన సాధారణ పరిపాలనా సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రత్యామ్నాయ వ్యవస్థపై ప్రజల ఆశలు
ప్రజా సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నిర్వహణ ఎంత ముఖ్యమో, సామన్యుల సమస్యలకు పరిష్కారం చూపడం కూడా అంతే అవసరం. పీజీఆర్‌ఎస్‌కు తాత్కాలిక విరామం ఏర్పడినప్పటికీ అత్యవసర ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ప్రజలకు తెలియాజేయాలని భాదితులు కోరుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మళ్లీ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే అంశంపైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమా(పీజీఆర్‌ఎస్)నికి ఎన్నికల కోడ్‌తో తాత్కాలిక విరామం ఏర్పడింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ కార్యక్రమం నిలిచిపోవడంతో ఫిర్యాదులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా వారానికి సుమారు 280 అర్జీలు, నెలకు దాదాపు 1,300 ఫిర్యాదులు అందుతుండడం జిల్లాలో ప్రజా సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది.
సమస్యల పరిష్కారానికి ఇదే ప్రధాన వేదిక
కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నేరుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులను కలిసి వినతిపత్రాలు అందించేవారు. భూ వివాదాలు, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, భూ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఫింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంఽధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టేవారు.
రెవెన్యూ సమస్యలే అధికం..
జిల్లాలో భూములకు సంబంధించిన సమస్యలతో కలెక్టరేట్‌ను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. భూ రికార్డుల్లో పేర్ల మార్పులు, సర్వే నంబర్లలో తప్పులు, భూ హక్కుల వివాదాలు, రీ సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులు, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలపై అనేకమంది ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందకపోవడం, కొత్త పింఛన్ల మంజూరు, రేషన్ కార్డుల సమస్యలు తదితర అంశాలపై కూడా వినతులు అందుతున్నాయి. గ్రీవెన్స్‌సెల్ నిలిచిపోవడంతో తమ సమస్యల పరిష్కారం మరింత ఆలస్యమవుందేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల విధులు, సిబ్బంది కేటాయింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సాధారణంగా నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా పరిపాలనా కార్యకలాపాలు
వారానికి 280 అర్జీలు..
నెలకు 1,300మంది గోడు
ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయిన
కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్
రెవెన్యూ, పింఛన్లు, భూ సమస్యలతో బాధితుల ఎదురుచూపులు
ఫిర్యాదులు చెప్పుకునే వేదిక లేక ప్రజల్లో ఆందోళన


