పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్రరావు మృతి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్రరావు మృతి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

బాడంగి/బొబ్బిలి రూరల్‌: మండలంలోని ముగడ గ్రామానికి చెందిన తీళ్లరాఘవేంద్రరావు(51) గుండెపోటుతో అకస్మాత్తుగా బొబ్బిలిలోని తన అద్దెఇంటివద్ద బుధవారం తెల్లవారు జామున మృతిచెందారు. ఆయన బంధువులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన బొబ్బిలిమండలంలోని పారాది పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.ఆయన బౌతికకాయాన్ని ముగడతీసుకొచ్చి సందర్శన నిమిత్తం మధ్యాహ్నం వరకు ఉంచగా బుడా చైర్మన్‌ తెంటు లక్షుంనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి శంబంగివేణు గోపాలనాయుడు, మాజీ జెడ్పీటీసీ పెద్దింటిరామారావు, బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్‌ తనసిబ్బందితో కలిసివచ్చి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. దహనసంస్కార ఖర్చులను అందజేసి, ప్రభుత్వంనుంచి రావాల్సిన ప్రయోజనాలకోసం ప్రతిపాదనచేస్తామని చెప్పారు. మృతునికి భార్య నాగమణి, డిగ్రీచదివిన కుమార్తె తన్మయి, విజయనగరంలోని ఎంవీజీఆర్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చేస్తున్న ఉదయ్‌కిరణ్‌ ఉన్నారు. ఆయన అంతిమసంస్కారాలను ముగడలోనే బంధువులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement