విద్యతోనే అత్యున్నత స్థాయి | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే అత్యున్నత స్థాయి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

పార్వతీపురం: విద్యతోనే అత్యున్నత స్థాయికి చేరుకోగలమని గుర్తించిన మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌ అని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు. ఈ మేరకు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవం, వైనార్టీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో చదువుకున్న వ్యక్తికి ఎంతో గుర్తింపు ఉంటుందన్నారు. అందుకు భారత తొలి విద్యాశాఖామంత్రిగా పనిచేసిన అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ నిదర్శనమని చెప్పారు. ఆయన విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, విద్యకోసం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆజాద్‌ చేసిన సేవలను గుర్తించి భారత రత్న బిరుదును పొందారన్నారు. ఆయన భావాలను ఆదర్శంగా తీసుకుని అందరు నడుచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది బదరీనాథ్‌, ఇంతియాజ్‌, ఏఓ పి.సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement