డెప్పూరులో చోరీ | - | Sakshi
Sakshi News home page

డెప్పూరులో చోరీ

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

వజ్రపుకొత్తూరు రూరల్‌: చీపురుపల్లి పంచాయతీ డెప్పూరులో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కాట నారాయణమ్మ వారం రోజుల క్రితం ముంబైలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని గుర్తించిన దుండగులు కట్టర్‌ సాయంతో తలుపులను కట్‌ చేసి లోపలికి ప్రవేశించారు. బీరువా తలుపులు పగలుగొట్టి రూ.50 వేలు నగదు, బంగారం గొలుసు పట్టుకుపోయారు. బాధితరాలి తల్లి సీరం లోలాక్షి ఎప్పటిలాగే ఉదయం పూల కోసం కుమార్తె ఇంటి వైపు వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ నీహార్‌ తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

పాతపట్నం: తెంబూరు గ్రామంలోని కండ్రవీధికి చెందిన మండల శారద(23) ఈ నెల 2న ఇంట్లో గడ్డిమందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆటోలో టెక్కలి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవాం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. ఈమె భర్త మండల గిరీశ్వరరావు ఉపాధి కోసం విదేశాల్లో పనిచేస్తున్నారు. కుమార్తె మహాన్య, కుమారుడు మహాంత్‌ ఉన్నారు. అత్త పుష్పలత వేధింపులే కారణమంటూ మృతురాలు తల్లి గాయశ్రీ సావిత్రి ఆరోపిస్తున్నా. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement