పూసపాటిరేగ: పూసపాటిరేగ మండలం, బత్తివలస గ్రామ టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో మంగళవారం చేరారు. యువనేత బొత్స చైతన్య నేతృత్వంలో వారంతా పార్టీలో చేరగా వారందరికీ పార్టీ కండువాలు వేసి, సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సహదేవ లక్ష్మణ్, సహదేవ కనకంరాజు, తార బలరాం, లండ పైడిరాజు కుటుంబాలతో పాటు మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సృష్టిస్తున్న దారుణాలు, అరాచకాలు చూసి, అందులో ఇమడలేకనే ప్రజల పక్షాన పోరాడే వైఎస్సార్ సీపీలోకి రావడం జరిగిందని వారు తెలిపారు. గతంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై భవిష్యత్‌లోనూ వైఎస్సార్ సీపీతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమమని భావించి పార్టీలో చేరడం జరిగిందన్నారు. పార్టీ అధిష్టానం మేరకు నడుచుకుంటామని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పడాల శ్రీధర్, గుజ్జు సురేష్‌రెడ్డి, మహంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


